🌸
చైత్ర శుద్ధ తదియ
శ్రీ మత్స్య జయంతి.
▫️
దేశంలో ఏకైక శ్రీ మత్స్య ఆలయం
నాగలాపురం
▫️
శ్రీ మహావిష్ణువు ఇక్కడ దశావతారపు
మొదటి అవతారమైన మత్స్యావతారంలో
విష్ణువు పూజలందుకునే ఏకైక దేవాలయం
మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది.
చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని
వేద ( మత్స్య ) నారాయణుడిగా కొలుస్తారు.
విజయనగర సామ్రాజ్య పాలనలో
శ్రీ కృష్ణదేవరాయలు తన తల్లి నాగమాంబ దేవి
జ్ఞాపకార్థం నాగలాపురం ఆలయ పట్టణం నిర్మించబడింది . అందుకే శ్రీ నాగలాపురం అయింది.
నాగలాపురంగా పేరు మారకముందు
ఈ గ్రామాన్ని హరిగండపురం అని పిలిచేవారు .
ఇది అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని
హరికంటాపురమని పేరు గాంచింది.
సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వద్ద ఉన్న
వేదాలను అపహరించి సముద్రంలో దాచినపుడు,
శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి
సముద్ర గర్భమున సోమకాసు